
రాజకీయాలు

విజయనగరం జిల్లాలో తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకు చెందిన వివిధ వినతులను పరిశీలించిన అనంతరం, 454 చెరువుల పునరుద్ధరణ, మరమ్మతుల పనులకు పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.22.14 కోట్లతో చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. ఈ పనుల ద్వారా జిల్లాలోని వందలాది గ్రామాలకు నీటి లభ్యత మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
2026–27 ఆర్థిక సంవత్సరానికి వి.బి.జి. రామ్ జి పథకం కింద అందుబాటులో ఉన్న మెటీరియల్ కాంపోనెంట్ నిధులను ఉపయోగించి ఈ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా చెరువుల్లో పూడిక తొలగించడం, చెరువులను పునరుద్ధరించడం, నీటి సరఫరా కాలువలకు మరమ్మతులు చేయడం, స్లూయిస్ గేట్లను బాగుచేయడం వంటి పనులు చేపడతారు. ఈ పనులు త్వరలో ప్రారంభం కానుండటంతో తాగునీరు, సాగునీటి సరఫరా మెరుగుపడే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!