

ఎన్నికల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు సంబంధించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఇతర ఎన్నికల కమిషనర్ల మెజారిటీ ఆమోదం లేకుండా తీసుకున్నట్లు ఆరోపిస్తున్న నిర్ణయాలు, మార్గదర్శకాలు, సాఫ్ట్‌వేర్ మార్పులను చెల్లనివిగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు.
ఫారం 6లో మార్పులు, SIRకు సంబంధించిన ఇతర నిర్ణయాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు పిటిషన్‌లో ప్రస్తావించారు. అసలు చట్టబద్ధమైన ఫారం 6ను పునరుద్ధరించడంతో పాటు, SIR సమయంలో ఓటర్ల పేర్ల తొలగింపుపై విచారణ జరపాలని కూడా కోరారు. అయితే SIRకు సంబంధించిన నిర్ణయాలు కమిషన్ అనుమతితోనే ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం పేర్కొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!