
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హర్యానాలో భారత తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించడంతో పాటు సుమారు రూ.14,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఢిల్లీ–అమృత్‌సర్–కత్రా ఎక్స్‌ప్రెస్‌వేతో ఢిల్లీ నుంచి కత్రా వరకు ప్రయాణ సమయం 14 గంటల నుంచి కేవలం 6 గంటలకు తగ్గనుంది. అలాగే జింద్–గోహనా రహదారి ప్రాజెక్టు ప్రాంతీయ రవాణాను మరింత వేగవంతం చేయనుంది.
అదనంగా కురుక్షేత్రలో ట్రాఫిక్ సమస్యల నివారణ కోసం నిర్మించిన ఎలివేటెడ్ రైల్వే ట్రాక్‌ను మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం చండీగఢ్, జలంధర్‌లలో వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. భివానిలోని పండిట్ నేకి రామ్ శర్మ మెడికల్ కాలేజీని ప్రారంభించడంతో పాటు కురుక్షేత్రలో సిక్కుల చరిత్రను ప్రతిబింబించే ప్రత్యేక మ్యూజియానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!