
రాజకీయాలు

ప్రధాని నరేంద్ర మోదీ నేడు మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పశ్చిమ బెంగాల్లోని ఐఐటీ ఖరగ్పూర్లో నిర్వహించే వజ్రోత్సవ వేడుకలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో సంస్థ సాధించిన ప్రగతిని గుర్తుచేసుకోనున్నారు.
అనంతరం బిహార్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చేరుకుని కౌశల్ దీక్షాంత్ సమారోహ్లో పాల్గొననున్నారు. మూడు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన విద్య, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన కార్యక్రమాలతో సాగనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!