

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి అక్రమ రవాణా ముఠా పోలీసులపై దాడికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చింతపల్లి మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుగడ్డ సమీపంలో ముందస్తు సమాచారంతో పోలీసులు బుధవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో గంజాయితో వస్తున్న కారును ఆపి తనిఖీ చేయడానికి ప్రయత్నించారు.
తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై గంజాయి ముఠా రాళ్లతో దాడి చేయడంతో పాటు ఒక ప్రధాన కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు గాలిలో హెచ్చరిక కాల్పులు జరిపారు. అనంతరం ముఠా సభ్యులు లొంగిపోగా, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 209 కిలోల గంజాయి, ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!