
జనరల్

షాహెద్ డ్రోన్లకు తోడుగా ఇరాన్ అభివృద్ధి చేసిన ఖైబర్ షెకాన్ క్షిపణి అమెరికాకు కొత్త సవాల్‌గా మారింది. 1,400 కిలోమీటర్ల పరిధి గల ఈ క్షిపణి పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలపై జరిగిన దాడుల్లో కీలక పాత్ర పోషించింది. ఘన ఇంధనంతో పనిచేయడం వల్ల ముందుగా ఇంధనం నింపాల్సిన అవసరం లేకుండా వేగంగా తరలించి దాడి చేయవచ్చు.
పాత క్షిపణులతో పోలిస్తే ఇది అధునాతన ఫ్లైట్ పాత్, అధిక వేగం, దిశ మార్చుకునే సామర్థ్యంతో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను తప్పించుకుంటోంది. కొన్ని వేరియంట్లు గంటకు 10,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. డ్రోన్లతో కలిపి వీటిని వినియోగించడం వల్ల అమెరికా రక్షణ వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!