

ఊపిరితిత్తుల్లో పెరిగిన క్యాన్సర్ కణితిని తొలగించేందుకు శస్త్రచికిత్స చేయించుకున్న పోప్ లియో-14 మెల్లగా కోలుకుంటున్నారు. మంగళవారం శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన, బుధవారం నాటికే నడక, ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాస వ్యాయామాలు ప్రారంభించినట్లు వైద్యులు వెల్లడించారు. అలాగే క్రమం తప్పకుండా ఆహారం తీసుకుంటున్నారని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం సజావుగా మెరుగుపడుతున్నట్లు ఎక్స్రేలు, రక్త పరీక్షల ఫలితాలు సూచిస్తున్నాయని వైద్య బృందం పేర్కొంది.
71 ఏళ్ల పోప్ లియో-14 అడెనోకార్సినోమా అనే ఒక రకమైన ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మరోవైపు, పోప్కు నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతం కావడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!