

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6E-6115 విమానం ఆదివారం ఢిల్లీ నుంచి 201 మంది ప్రయాణికులతో చెన్నైకి బయలుదేరింది. శంషాబాద్ రాడార్ పరిధిలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడి బ్యాగులో ఉన్న పవర్ బ్యాంక్ నుంచి అకస్మాత్తుగా పొగలు వెలువడినట్లు సమాచారం. దీనిని గుర్తించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై పైలట్‌కు సమాచారం అందించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పైలట్ తగిన చర్యలు చేపట్టారు.
పైలట్ శంషాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులకు సమాచారం అందించడంతో విమానాన్ని హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై విమానయాన అధికారులు దృష్టి సారించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!