26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా ఎన్‌ఎస్‌ఈ

Writer: Pooja 04:08 PM, 26 నవంబర్, 2026
ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా ఎన్‌ఎస్‌ఈ

భారత జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ప్రపంచ ఆర్థిక రంగంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద లిస్టెడ్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా అవతరించింది. గురువారం ట్రేడింగ్‌లో ఎన్‌ఎస్‌ఈ షేర్లు భారీగా పెరగడంతో సంస్థ మార్కెట్ విలువ సుమారు 64.1 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.5.92 లక్షల కోట్లు) చేరింది. దీంతో 63.4 బిలియన్ డాలర్ల విలువ కలిగిన జర్మనీకి చెందిన డాయిష్ బోర్స్, 62.4 బిలియన్ డాలర్ల విలువైన బ్రిటన్ లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్‌ను వెనక్కి నెట్టింది. అంతకుముందు వారమే నాస్‌డాక్ (59.4 బిలియన్ డాలర్లు), హాంకాంగ్ ఎక్స్ఛేంజ్ (57.1 బిలియన్ డాలర్లు)లను అధిగమించి ఐదో స్థానానికి చేరిన ఎన్‌ఎస్‌ఈ, కొద్ది రోజుల్లోనే మూడో స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.

ప్రపంచ స్టాక్ ఎక్స్ఛేంజీల జాబితాలో అమెరికాకు చెందిన సీఏంఈ గ్రూప్ 111.6 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో మొదటి స్థానంలో ఉండగా, ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ (ఐసీఈ) 99.4 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. గురువారం ట్రేడింగ్‌లో ఎన్‌ఎస్‌ఈ షేరు ధర ఇంట్రాడేలో 3.5 శాతం పెరిగి రూ.2,400 ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకింది. 2026 సెప్టెంబర్ 24న రూ.1,785 ఇష్యూ ధరతో ఐపీఓ ద్వారా లిస్ట్ అయిన ఈ షేరు, సుమారు రెండు నెలల్లోనే దాదాపు 35 శాతం లాభపడింది. లిస్టింగ్ తర్వాత నమోదైన రూ.1,640 కనిష్ఠ స్థాయి నుంచి సుమారు 50 శాతం కోలుకుంది. నవంబర్‌లో జరిగిన 18 ట్రేడింగ్ సెషన్లలో 14 రోజులు లాభాలతో ముగిసింది. 2026–27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నిర్వహణ లాభం (EBITDA) దాదాపు రెట్టింపు కావడం, దేశీయ రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరగడం ఈ ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా చిన్నారులకు ఎలాన్ మస్క్ అదిరిపోయే గిఫ్ట్

అమెరికా చిన్నారులకు ఎలాన్ మస్క్ అదిరిపోయే గిఫ్ట్

చంద్రశేఖరన్‌ పునర్నియామకంపై వివాదం..

చంద్రశేఖరన్‌ పునర్నియామకంపై వివాదం..

భారీగా తగ్గి మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు

భారీగా తగ్గి మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు

భారత వస్తువులపై అదనపు సుంకాలకు అమెరికా ప్రతిపాదన

భారత వస్తువులపై అదనపు సుంకాలకు అమెరికా ప్రతిపాదన

అమెరికా టారిఫ్ల భయాలతో కుప్పకూలిన ప్రపంచ మార్కెట్లు

అమెరికా టారిఫ్ల భయాలతో కుప్పకూలిన ప్రపంచ మార్కెట్లు

పసిడి, వెండి ధరలకు మళ్లీ తగ్గుదల

పసిడి, వెండి ధరలకు మళ్లీ తగ్గుదల

ట్యాగ్లు
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ఎన్‌ఎస్‌ఈ షేర్లుభారత స్టాక్ మార్కెట్ప్రపంచ స్టాక్ ఎక్స్ఛేంజీలుమార్కెట్ క్యాపిటలైజేషన్రిటైల్ ఇన్వెస్టర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సమంత డెలివరీపై శోభారాజు చేసిన వ్యాఖ్యలు వైరల్
సినిమాలు

సమంత డెలివరీపై శోభారాజు చేసిన వ్యాఖ్యలు వైరల్

ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా ఎన్‌ఎస్‌ఈ
బిజినెస్

ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా ఎన్‌ఎస్‌ఈ

ఎన్విడియాలో మరో ప్రేమకథ..
జనరల్

ఎన్విడియాలో మరో ప్రేమకథ..

పాటలతో హైప్..కథతోనే అసలు పరీక్ష!
సినిమాలు

పాటలతో హైప్..కథతోనే అసలు పరీక్ష!

తిరుమల శ్రీవారికి 46 రకాల ప్రత్యేక బంగారు ఆభరణాల కానుక
జనరల్

తిరుమల శ్రీవారికి 46 రకాల ప్రత్యేక బంగారు ఆభరణాల కానుక

హైదరాబాద్‌లో కాంగ్రెస్ ‘సంవిధాన్ రక్షా మార్చ్’..
రాజకీయాలు

హైదరాబాద్‌లో కాంగ్రెస్ ‘సంవిధాన్ రక్షా మార్చ్’..

ఎయిడ్స్ నియంత్రణలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ
జనరల్

ఎయిడ్స్ నియంత్రణలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ

పాక్ వెబ్‌సిరీస్ ప్రసారంపై నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం ఆదేశాలు
జనరల్

పాక్ వెబ్‌సిరీస్ ప్రసారంపై నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం ఆదేశాలు

పీఎంఎల్‌ఏ న్యాయనిర్ణాయక సంస్థపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

పీఎంఎల్‌ఏ న్యాయనిర్ణాయక సంస్థపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
రాజకీయాలు

ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

బ్యాంకాక్‌లో చమురు డిపోలో భారీ పేలుడు..
జనరల్

బ్యాంకాక్‌లో చమురు డిపోలో భారీ పేలుడు..

దేశభక్తి కథాంశంతో అర్జున్ సర్జా భారీ పాన్ ఇండియా సినిమా
సినిమాలు

దేశభక్తి కథాంశంతో అర్జున్ సర్జా భారీ పాన్ ఇండియా సినిమా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!