

అన్నమయ్య పదకోకిల, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత, రాజ్ నిడిమోరు దంపతులకు మగబిడ్డ జన్మించిన సందర్భంలో చోటుచేసుకున్న పలు ఆసక్తికర, భావోద్వేగ విషయాలను పంచుకున్నారు. నవంబర్ 19న సమంతకు డెలివరీ జరిగిన సమయంలో ఎదురైన పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. బాబు మెడకు బొడ్డుతాడు చుట్టుకోవడంతో గర్భంలో శిశువు కదలికలు తగ్గాయని తెలిపారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులంతా కలిసి తల్లి, బిడ్డ క్షేమంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు.
సమంతను సిజేరియన్ కోసం తీసుకెళ్తున్నారని తెలియడంతో ఇంట్లోనే కుటుంబ సభ్యులంతా సుమారు 25 నుంచి 30 నిమిషాల పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లు శోభారాజు వెల్లడించారు. కొద్దిసేపటికే సమంతకు సాధారణ ప్రసవం జరిగిందని ఫోన్ రావడంతో ఎంతో ఆనందించామని చెప్పారు. ఈ సంఘటన ప్రార్థనల శక్తిని మరోసారి గుర్తుచేసిందని పేర్కొన్నారు. ఇక రాజ్ బాబును తన చేతికి ఇవ్వబోతే తాను వద్దన్నట్లు తెలిపారు. అప్పుడే బయట నుంచి రావడంతో పసిబిడ్డకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుందనే ఆలోచనతో బాబును ఎత్తుకోలేదని వివరించారు. అయితే దూరం నుంచే తల్లీబిడ్డలను మనస్ఫూర్తిగా ఆశీర్వదించినట్లు చెప్పారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!