
రాజకీయాలు

మాజీ ఎంపీ ప్రజ్వాల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. నిర్ణీత గడువులోగా దర్యాప్తు సంస్థ ఛార్జిషీట్ దాఖలు చేయనందున, డిఫాల్ట్ బెయిల్ కోరే హక్కు ప్రజ్వాల్ రేవణ్ణకు ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
జస్టిస్ ఎం. నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, మరో అత్యాచారం కేసులో ప్రజ్వాల్ రేవణ్ణకు ఇప్పటికే జీవిత ఖైదు శిక్ష పడిన విషయం తెలిసిందే. తాజా ఉత్తర్వులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు సంబంధించినవే కావడంతో, ఈ కేసులో తదుపరి న్యాయపరమైన పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!