
ఓటీటీ

పెనమలూరు ఠాణా పరిధిలోని యనమలకుదురు, కానూరు, పోరంకి, సనత్‌నగర్ ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్‌లు నిత్యం అల్లర్లు సృష్టిస్తున్నాయి. అర్ధరాత్రి వేళ గుంపులుగా తిరుగుతూ పరస్పరం దాడులు చేసుకుంటూ గ్యాంగ్‌వార్‌లకు పాల్పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ నగరంలో నిషేధానికి గురైన వ్యక్తులు ఈ ప్రాంతాల్లో తలదాచుకుంటూ గంజాయి విక్రయాలు పెంచుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. కానూరులో ఇటీవల కారు పార్కింగ్ వివాదంలో యువకుడిపై దాడి జరిగింది. కత్తులు, బీరు సీసాలతో జరిగిన ఘర్షణల్లో పలువురికి గాయాలు అయ్యాయి. పోలీసులు రాత్రి గస్తీ పెంచి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!