

థాయ్‌లాండ్‌లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజధాని బ్యాంకాక్‌లో వరద పరిస్థితి తీవ్రంగా మారింది. దాదాపు 48 గంటల్లో 300 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడంతో ప్రధాన రహదారులు, కాలువలు నీటమునిగాయి. దీంతో ప్రజా రవాణా, రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బ్యాంకాక్‌లోని మొత్తం 50 జిల్లాలను విపత్తు ప్రభావిత ప్రాంతాలుగా అధికారులు ప్రకటించారు.
వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సువర్ణభూమి విమానాశ్రయంలో విమాన సర్వీసులు కొనసాగుతున్నప్పటికీ, విమానాశ్రయానికి వెళ్లే రహదారులపై వరదల ప్రభావంతో ప్రయాణికులు అదనపు సమయం కేటాయించుకోవాలని అధికారులు సూచించారు. విమానాశ్రయ కార్యకలాపాల్లోనూ కొన్ని అంతరాయాలు, ఆలస్యాలు నమోదయ్యాయి. మరోవైపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!