

తెలుగు పంచాంగం ప్రకారం ఐదో మాసమైన శ్రావణ మాసాన్ని శుభాల మాసంగా భావిస్తారు. వివాహాలు, మంగళ గౌరీ నోములు, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి వంటి పండుగలు, వ్రతాలు ఈ మాసానికి ప్రత్యేకతను తీసుకొస్తాయి. పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంతో సంబంధం కలిగి ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని హిందూ సంప్రదాయం చెబుతోంది. 2026లో శ్రావణ మాసం ఆగస్టు 13, గురువారం ప్రారంభమవుతుంది.
శ్రావణ మాసంలో నాగ చతుర్థి, నాగ పంచమి, గరుడ పంచమి, కల్కి జయంతి, శ్రీ వరలక్ష్మీ వ్రతం వంటి ముఖ్యమైన పర్వదినాలు ఉన్నాయి. ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి వంటి విశేషాలు జరగనున్నాయి. అనంతరం రాఘవేంద్ర స్వామి ఆరాధన, సంకష్టహర చవితి, బలరామ జయంతి, శ్రీకృష్ణ జన్మాష్టమి, ఏకాదశి, మాసశివరాత్రి, పోలాల అమావాస్య వంటి పుణ్య తిథులు వస్తాయి. సెప్టెంబర్ 11న పోలాల అమావాస్యతో శ్రావణ మాసం ముగుస్తుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!