

తెలంగాణలో ఖరీఫ్ 2026 సీజన్‌లో ఎరువుల పంపిణీ సాఫీగా జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎరువుల కొరత రాకుండా ముందస్తుగా నిల్వలు ఏర్పాటు చేయడంతో పాటు, దిగుమతి చేసుకునే ఎరువులు వేగంగా రాష్ట్రానికి చేరేలా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేశామని చెప్పారు. ఫెర్టిలైజర్ యాప్ ద్వారా నిల్వలు, బుకింగ్‌లు, రైతుల కొనుగోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పంపిణీలో పారదర్శకతను పెంచినట్లు తెలిపారు.
ఫెర్టిలైజర్ యాప్ ద్వారా 33.39 లక్షల మంది రైతులు నమోదు చేసుకోగా, 142.08 లక్షల బస్తాలు బుక్ అయ్యాయి. ఇందులో 128.18 లక్షల బస్తాలను రైతులు కొనుగోలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఫెర్టిలైజర్ ఫెసిలిటేషన్ సిస్టమ్ ద్వారా 37.48 లక్షల క్యూఆర్ కోడ్‌లు జారీ కాగా, 141.88 లక్షల బస్తాలు బుక్ అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2.33 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని మంత్రి తెలిపారు. అక్టోబర్‌లో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 30 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ సరఫరాకు ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!