
షోస్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది. ఎస్‌ఐఆర్‌లో భాగంగా తొలగించిన లేదా అనర్హులుగా గుర్తించిన ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలించేందుకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ఇంటింటికీ వెళ్లనున్నారు. ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, అర్హత ఉన్నవారి వివరాలను పరిశీలించనున్నారు.
పరిశీలనలో భాగంగా పొరపాటున ఓటు తొలగించినట్లు తేలితే సంబంధిత ఓటర్లతో బీఎల్‌ఓలు ఫారం-6 నింపించనున్నారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు కూడా ఫారం-6 ద్వారా దరఖాస్తు చేయించనున్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!