
జనరల్

భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో పలు చెరువులు నిండిపోయి అలుగులు పారుతున్నాయి. పెద్దకొడప్‌గల్ మండలం కుబ్యానాయక్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బ తండా సమీపంలో ఉన్న కాస్లాబాద్ చెరువు పూర్తిగా నిండడంతో అలుగు పారుతోంది. దీంతో దుబ్బ తండా నుంచి కాస్లాబాద్‌కు వెళ్లే రహదారి నీట మునిగి ప్రమాదకరంగా మారింది.
అయినప్పటికీ చదువుపై ఉన్న తపనతో గురువారం సుమారు 20 మంది విద్యార్థులు పెద్దల సహాయంతో వరద నీటిని దాటి కాస్లాబాద్‌లోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. పాఠశాల ముగిసిన తర్వాత తిరిగి ఇంటికి చేరేందుకు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ప్రతి వర్షాకాలంలో ఈ సమస్య పునరావృతమవుతోందని గ్రామస్థులు, తల్లిదండ్రులు తెలిపారు. విద్యార్థుల రాకపోకలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!