22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ ఇంజినీర్ల సీనియారిటీ పిటిషన్లు.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు

Writer: Nithish 06:23 AM, 22 సెప్టెంబర్, 2026
ఏపీ ఇంజినీర్ల సీనియారిటీ పిటిషన్లు.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు

సాగునీటి శాఖలో పనిచేస్తున్న ఇంజినీర్ల సీనియారిటీ, పదోన్నతులకు సంబంధించిన వివాదంలో ఏపీ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. జస్టిస్‌ ఎం.ఎం. సుందరేష్‌, జస్టిస్‌ ప్రసన్న బి. వరాలేతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన వివాదాలను తెలంగాణ హైకోర్టు విచారించడం కంటే, ఆ పిటిషన్లను ఏపీ హైకోర్టులోనే విచారించడం సముచితమని కోరుతూ 2021లో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి శాఖకు చెందిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ల సీనియారిటీ జాబితాపై గతంలో వివాదం తలెత్తింది. 2019లో తెలంగాణ హైకోర్టు సంబంధిత ఉత్తర్వులను కొట్టివేసి, అన్ని జోన్లకు ఇంజినీర్ల సీనియారిటీని పునఃనిర్ధారించాలని ఆదేశించింది. అనంతరం ఏపీ ప్రభుత్వం సీనియారిటీ ఖరారుకు చర్యలు చేపట్టగా, కొందరు ఉద్యోగులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో కొందరు ఇంజినీర్లు తెలంగాణ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు. రెండు హైకోర్టుల్లో విచారణలు కొనసాగుతున్న నేపథ్యంలో పిటిషన్లన్నింటినీ ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. దీనికి పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో బదిలీకి ధర్మాసనం అనుమతించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి - హరీశ్‌రావు

జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు

ఏపీపై వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు కుండపోత వర్షాల హెచ్చరిక

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమావేశం

నీట్ ర్యాంకర్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం

నీట్ ర్యాంకర్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సూర్యచంద్రుల వాహనసేవ

ట్యాగ్లు
సుప్రీంకోర్టుఏపీ హైకోర్టుతెలంగాణ హైకోర్టుసాగునీటి శాఖఇంజినీర్ల సీనియారిటీఉద్యోగుల సీనియారిటీపదోన్నతులుఏపీ ఉద్యోగులుతెలంగాణఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హూతీలపై దాడికి సిద్ధమై.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన అమెరికా
జనరల్

హూతీలపై దాడికి సిద్ధమై.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన అమెరికా

ఏపీ ఇంజినీర్ల సీనియారిటీ పిటిషన్లు.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు
జనరల్

ఏపీ ఇంజినీర్ల సీనియారిటీ పిటిషన్లు.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు

జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి - హరీశ్‌రావు
జనరల్

జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి - హరీశ్‌రావు

జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు
జనరల్

జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు

ఏపీపై వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు కుండపోత వర్షాల హెచ్చరిక
జనరల్

ఏపీపై వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు కుండపోత వర్షాల హెచ్చరిక

గ్లోబల్‌ ఏఐ హబ్‌గా భారత్‌.. ఏఐ ఉద్యోగాల్లో రెండోస్థానంలో దేశం
టెక్నాలజీ

గ్లోబల్‌ ఏఐ హబ్‌గా భారత్‌.. ఏఐ ఉద్యోగాల్లో రెండోస్థానంలో దేశం

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమావేశం
జనరల్

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమావేశం

నీట్ ర్యాంకర్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం
జనరల్

నీట్ ర్యాంకర్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సూర్యచంద్రుల వాహనసేవ
జనరల్

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సూర్యచంద్రుల వాహనసేవ

పరివర్తిని ఏకాదశి నేడు.. శ్రీమహావిష్ణువును ఇలా పూజిస్తే శుభఫలితాలు

నేటి రాశిఫలాలు - 12 రాశుల వారికి ఎలా ఉందంటే?

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 15 - బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. సృష్టి-సుధీర్ మధ్య తీవ్ర గొడవ
షోస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!