7, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బియ్యం ధరల మోసాలకు తెలంగాణ ప్రభుత్వం చెక్!

Writer: Pooja 08:43 AM, 7 నవంబర్, 2026
బియ్యం ధరల మోసాలకు తెలంగాణ ప్రభుత్వం చెక్!

బియ్యం కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం, వినియోగదారులను మోసం చేయడం వంటి అక్రమాలను అరికట్టేందుకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ కీలక చర్యలు చేపట్టింది. పౌరసరఫరాల కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం. స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ (ETF), లీగల్ మెట్రాలజీ శాఖ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాయి. ఇందులో భాగంగా బియ్యం రకాలకు గరిష్ఠ చిల్లర ధరలను నిర్ణయించారు. బీపీటీ/కేఎన్‌ఎం బియ్యం కిలో రూ.66కు, ఆర్‌ఎన్‌ఆర్/తెలంగాణ సోనా కిలో రూ.74కు, హెచ్‌ఎంటీ/జేఎస్‌ఆర్ బియ్యం కిలో రూ.79కు మించి విక్రయించకూడదని స్పష్టం చేశారు. 26 కిలోల ప్యాకెట్లపై ఈ గరిష్ఠ ధరలను స్పష్టంగా ముద్రించాలని మిల్లర్లు, వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు.

అక్టోబర్ 29 నుంచి నవంబర్ 5, 2026 వరకు వారం రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ బృందాలు రైస్ మిల్లులు, హోల్‌సేల్ దుకాణాలు, రిటైల్ విక్రయ కేంద్రాల్లో మొత్తం 1,141 ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 55 కేసులు నమోదు చేయగా, వాటిలో 35 క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరోవైపు లీగల్ మెట్రాలజీ శాఖ 1,545 తనిఖీలు నిర్వహించి, 280 కేసులు నమోదు చేసింది. 25 కిలోల బియ్యం ఉన్న బస్తాలపై 26 కిలోలుగా లేబుల్స్ వేయడం, తయారీదారులు ముద్రించిన అసలు ధరలను అధిక ధరల స్టిక్కర్లతో కప్పివేయడం, పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, జీఎస్టీ లేదా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులు లేకుండా వ్యాపారం చేయడం వంటి అక్రమాలను అధికారులు గుర్తించారు. పదేపదే పీడీఎస్ బియ్యాన్ని నిల్వ చేయడం లేదా ధరల మోసాలకు పాల్పడే వారిపై ప్రివెంటివ్ డిటెన్షన్ (PD) చట్టంతో పాటు అత్యవసర వస్తువుల చట్టం, భారతీయ న్యాయ సంహిత (BNS) కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిరంతర నిఘా, తనిఖీలు కొనసాగుతాయని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉల్లి ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు

ఉల్లి ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు

ఈ దీపావళి ఈ నాలుగు రాశుల పాలిట ప్రత్యేకం కానుందా?

ఈ దీపావళి ఈ నాలుగు రాశుల పాలిట ప్రత్యేకం కానుందా?

ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంపై అమెరికా దాడి

ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంపై అమెరికా దాడి

భక్తుల వస్త్రధారణపై సింహాచలం దేవస్థానం కీలక నిర్ణయం

భక్తుల వస్త్రధారణపై సింహాచలం దేవస్థానం కీలక నిర్ణయం

బాణసంచా దుకాణాల అనుమతుల్లో అక్రమ వసూళ్ల ఆరోపణలు

బాణసంచా దుకాణాల అనుమతుల్లో అక్రమ వసూళ్ల ఆరోపణలు

నిరుద్యోగ యువత నైపుణ్యాభివృద్ధికి వరంగల్ ఎన్‌ఐటీ కీలక ముందడుగు

నిరుద్యోగ యువత నైపుణ్యాభివృద్ధికి వరంగల్ ఎన్‌ఐటీ కీలక ముందడుగు

ట్యాగ్లు
తెలంగాణ పౌరసరఫరాల శాఖబియ్యం ధరల నియంత్రణబియ్యం గరిష్ఠ ధరవినియోగదారుల రక్షణలీగల్ మెట్రాలజీఅక్రమ వ్యాపారాలపై చర్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బియ్యం ధరల మోసాలకు తెలంగాణ ప్రభుత్వం చెక్!
జనరల్

బియ్యం ధరల మోసాలకు తెలంగాణ ప్రభుత్వం చెక్!

ఉల్లి ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు
జనరల్

ఉల్లి ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు

ఈ దీపావళి ఈ నాలుగు రాశుల పాలిట ప్రత్యేకం కానుందా?
జనరల్

ఈ దీపావళి ఈ నాలుగు రాశుల పాలిట ప్రత్యేకం కానుందా?

ఓటీటీలో తమన్నా సినిమాకు ఊహించని ట్విస్ట్
ఓటీటీ

ఓటీటీలో తమన్నా సినిమాకు ఊహించని ట్విస్ట్

72వ వసంతంలోకి అడుగుపెట్టిన కమల్ హాసన్‌కు జన్మదిన శుభాకాంక్షలు
సినిమాలు

72వ వసంతంలోకి అడుగుపెట్టిన కమల్ హాసన్‌కు జన్మదిన శుభాకాంక్షలు

ఏపీలో నేడే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
రాజకీయాలు

ఏపీలో నేడే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంపై అమెరికా దాడి
జనరల్

ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంపై అమెరికా దాడి

భక్తుల వస్త్రధారణపై సింహాచలం దేవస్థానం కీలక నిర్ణయం
జనరల్

భక్తుల వస్త్రధారణపై సింహాచలం దేవస్థానం కీలక నిర్ణయం

చలికాలంలో ఈ తప్పులు చేయొద్దంటున్న వైద్యులు
ఆరోగ్యం

చలికాలంలో ఈ తప్పులు చేయొద్దంటున్న వైద్యులు

ధన త్రయోదశి తర్వాత మళ్లీ పెరిగిన పసిడి ధరలు
బిజినెస్

ధన త్రయోదశి తర్వాత మళ్లీ పెరిగిన పసిడి ధరలు

బాణసంచా దుకాణాల అనుమతుల్లో అక్రమ వసూళ్ల ఆరోపణలు
జనరల్

బాణసంచా దుకాణాల అనుమతుల్లో అక్రమ వసూళ్ల ఆరోపణలు

నిరుద్యోగ యువత నైపుణ్యాభివృద్ధికి వరంగల్ ఎన్‌ఐటీ కీలక ముందడుగు
జనరల్

నిరుద్యోగ యువత నైపుణ్యాభివృద్ధికి వరంగల్ ఎన్‌ఐటీ కీలక ముందడుగు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!