

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వలస విధానాల విషయంలో భారీ విజయం దక్కింది. హైతీ, సిరియా దేశాలకు చెందిన వలసదారులకు ఇచ్చిన తాత్కాలిక రక్షణ హోదా (TPS)ను రద్దు చేయడానికి అనుమతి ఇచ్చిన అమెరికా సుప్రీంకోర్టు, ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో లక్షలాది మంది వలసదారుల డిపోర్టేషన్‌కు మార్గం సుగమమైంది.
ఈ తీర్పుతో సుమారు 3.5 లక్షల మంది హైతీ పౌరులు, 6,100 మంది సిరియా పౌరులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. వీరంతా ప్రస్తుతం అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఇకపై వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడే పరిస్థితి ఏర్పడింది.
ట్రంప్ ప్రభుత్వం ఈ తీర్పును స్వాగతిస్తూ “చట్టానికి లభించిన విజయం”గా పేర్కొంది. అయితే మానవ హక్కుల సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వలసదారుల రక్షణపై కోర్టులు తక్కువ జోక్యం చేసుకోవాలని మెజారిటీ తీర్పు స్పష్టం చేయగా, భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!