16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆల్ఫారెట్టాలో తానా, తామా మట్టి వినాయక వర్క్‌షాప్

Writer: Pooja 10:07 PM, 16 సెప్టెంబర్, 2026
ఆల్ఫారెట్టాలో తానా, తామా మట్టి వినాయక వర్క్‌షాప్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న జార్జియాలోని ఆల్ఫారెట్టా డిసానా మిడిల్ స్కూల్‌లో మట్టి వినాయక విగ్రహాల తయారీ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. సాంప్రదాయం, సృజనాత్మకత, పర్యావరణ స్పృహ, సమాజ స్ఫూర్తిని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఈ కార్యక్రమంలో పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిపి 150 మందికి పైగా పాల్గొన్నారు. ClayGanesha.org భాగస్వామ్యంతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో పర్యావరణహిత విత్తన వినాయక విగ్రహాల తయారీపై అవగాహన కల్పించారు.

“సేవా భావంతో భక్తి - నాటండి, పూలు వికసించడాన్ని చూడండి!” అనే ఇతివృత్తంతో సహజమైన మట్టిలో విత్తనాలను కలిపి వినాయక విగ్రహాలను తయారు చేశారు. గణేష్ చతుర్థి వేడుకల అనంతరం ఈ విగ్రహాలను నాటితే వాటి నుంచి మొక్కలు పెరిగి పూలు పూస్తాయని నిర్వాహకులు వివరించారు. ముఖర్జీ వేములపల్లి కార్యక్రమానికి నాయకత్వం వహించి సమన్వయం చేశారు. బాబీ భార్య సౌజన్య ఆరేకపల్లి, వారి ఇద్దరు పిల్లలు కూడా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. శ్రీనివాస్ రామానాథం, యశ్వంత్ జొన్నలగడ్డ, వినయ్ మద్దినేని, పార్వతి కొంపెల్ల, చైతన్య కొర్రపాటి తదితరులు తానా, తామా బృందాలతో కలిసి కార్యక్రమ నిర్వహణకు సహకరించారు.

కుటుంబాలకు కేటాయించిన సమయాల ప్రకారం కార్యక్రమానికి హాజరు కావడంతో వర్క్‌షాప్ రోజంతా ఉత్సాహంగా సాగింది. విరాళాలు అందించి కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన సునీల్ దేవరపల్లికి నిర్వాహకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తానా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, తామా అధ్యక్షురాలు సునీత పొట్నూరు, తామా ఛైర్మన్ మధుకర్ యార్లగడ్డ, ప్రాంతీయ ప్రతినిధి శేఖర్ కొల్లు, సోషల్ వెల్ఫేర్ కోఆర్డినేటర్ సునీల్ దేవరపల్లి, బోర్డు డైరెక్టర్ భరత్ మద్దినేని, వుమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ కార్యదర్శి సోహిని అయినాల తదితరులు కార్యక్రమం విజయవంతానికి సహకరించారు. సంప్రదాయాలను కొనసాగిస్తూనే భావితరాల్లో పర్యావరణ బాధ్యత, సృజనాత్మకత, సమాజ సేవపై అవగాహన పెంచడమే కార్యక్రమం లక్ష్యంగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వినాయక నిమజ్జనంలో విషాదం...ఆరుగురు విద్యార్థులు మృతి

వినాయక నిమజ్జనంలో విషాదం...ఆరుగురు విద్యార్థులు మృతి

శ్రీదేవి కుటుంబ ఆస్తిపై సుప్రీంకోర్టు స్టేటస్ కో

శ్రీదేవి కుటుంబ ఆస్తిపై సుప్రీంకోర్టు స్టేటస్ కో

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్  ఆదేశాలు

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశాలు

కొత్త సీబీఎఫ్‌సీ బోర్డులో సినీ తారలు

కొత్త సీబీఎఫ్‌సీ బోర్డులో సినీ తారలు

తెలుగు రాజకీయాల్లో పెరుగుతున్న ఎన్నారైల ప్రాధాన్యం

తెలుగు రాజకీయాల్లో పెరుగుతున్న ఎన్నారైల ప్రాధాన్యం

తెలంగాణలో చేయూత పెన్షన్ నూతన దరఖాస్తుల గడువు ముగింపు

తెలంగాణలో చేయూత పెన్షన్ నూతన దరఖాస్తుల గడువు ముగింపు

ట్యాగ్లు
తానాతామామట్టి వినాయక విగ్రహాలుఆల్ఫారెట్టాపర్యావరణహిత వినాయకుడుగణేష్ చతుర్థి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన
క్రీడలు

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

ఆల్ఫారెట్టాలో తానా, తామా మట్టి వినాయక వర్క్‌షాప్
జనరల్

ఆల్ఫారెట్టాలో తానా, తామా మట్టి వినాయక వర్క్‌షాప్

వినాయక నిమజ్జనంలో విషాదం...ఆరుగురు విద్యార్థులు మృతి
జనరల్

వినాయక నిమజ్జనంలో విషాదం...ఆరుగురు విద్యార్థులు మృతి

శ్రీదేవి కుటుంబ ఆస్తిపై సుప్రీంకోర్టు స్టేటస్ కో
జనరల్

శ్రీదేవి కుటుంబ ఆస్తిపై సుప్రీంకోర్టు స్టేటస్ కో

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్  ఆదేశాలు
జనరల్

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశాలు

ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ
సినిమాలు

ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్
బిజినెస్

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్

బిగ్‌బాస్ హౌస్‌లో రీఎంట్రీ ట్విస్ట్
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లో రీఎంట్రీ ట్విస్ట్

ఆసియా గేమ్స్ పతక విజేతలకు బీఎఫ్‌ఐ గుడ్ న్యూస్
క్రీడలు

ఆసియా గేమ్స్ పతక విజేతలకు బీఎఫ్‌ఐ గుడ్ న్యూస్

కొత్త సీబీఎఫ్‌సీ బోర్డులో సినీ తారలు
జనరల్

కొత్త సీబీఎఫ్‌సీ బోర్డులో సినీ తారలు

తెలుగు రాజకీయాల్లో పెరుగుతున్న ఎన్నారైల ప్రాధాన్యం
జనరల్

తెలుగు రాజకీయాల్లో పెరుగుతున్న ఎన్నారైల ప్రాధాన్యం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!