
జనరల్

సూర్య ప్రధాన పాత్రలో జితు మాధవన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీన్’ (Scene). ఇందులో నజ్రియా కథానాయికగా నటిస్తుండగా.. నస్లెన్, ఆనంద్‌రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య డీఎస్పీ ఇన్బరాజ్‌గా పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 6న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో సూర్య మరోసారి పోలీస్ అధికారిగా కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జ్యోతిక, సూర్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుసిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!