
జనరల్

తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఆదిలాబాద్‌లో గరిష్ఠంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, మహబూబ్‌నగర్‌లో 36.2 డిగ్రీలు, హైదరాబాద్‌లో సుమారు 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరోవైపు తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది. ఇవాళ ఉత్తర, మధ్య తెలంగాణ ప్రాంతాల నుంచి రుతుపవనాలు వెనక్కి వెళ్లనున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం నాటికి రాష్ట్రం నుంచి పూర్తిస్థాయిలో నైరుతి రుతుపవనాలు నిష్క్రమించే అవకాశం ఉందని వెల్లడించారు. రుతుపవనాల నిష్క్రమణతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా రాష్ట్రంలో వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!