

సివిల్ డ్రెస్లో ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహిస్తూ, వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారన్న ఆరోపణలపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ టి. మాధవీ దేవి విచారణ చేపట్టారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు చట్టపరమైన విధానాలను పాటించకుండా సోదాలు నిర్వహిస్తున్నారంటూ పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా హోంశాఖ, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, టాస్క్ ఫోర్స్ డీసీపీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా సోదాలు నిర్వహించడం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS), 2023 నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ వాదించారు. అలాగే, వారెంట్లు జారీ చేసే అధికారం మెజిస్ట్రేట్లకే ఉంటుందని, ఏసీపీలు వారెంట్లు జారీ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 12కు వాయిదా వేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!