7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు కొత్త వ్యూహం..

Writer: Chandrika 10:46 PM, 7 అక్టోబర్, 2026
తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు కొత్త వ్యూహం..

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణ, వాయు నాణ్యత మెరుగుదలకు ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ (AQMC) ఆధ్వర్యంలో సమగ్ర చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) మార్గదర్శకాలకు అనుగుణంగా చేపడుతున్న కార్యక్రమాలపై అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, AQMC ఛైర్మన్ అహ్మద్ నదీమ్, TGPCB మెంబర్ సెక్రటరీ, కమిటీ మెంబర్ కన్వీనర్ రవి ఆధ్వర్యంలో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. PM10 స్థాయిలు, రోడ్ డస్ట్ నియంత్రణ, వాహన కాలుష్యం, పారిశ్రామిక ఉద్గారాలు, వ్యవసాయ అవశేషాల దహనం, పచ్చదనం పెంపు, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP) అమలు తదితర అంశాలను అధికారులు సమీక్షించారు. 2019–20 నుంచి 2025–26 మధ్య హైదరాబాద్‌లో వార్షిక సగటు PM10 స్థాయులు 86 నుంచి 80 µg/m³కు, సంగారెడ్డిలో 87 నుంచి 78 µg/m³కు తగ్గినట్లు సమావేశంలో వెల్లడైంది. 2025–26లో నల్గొండలో PM10 స్థాయి 71 µg/m³గా నమోదైంది. AQI ప్రధానంగా ‘సంతృప్తికర’ నుంచి ‘మితమైన’ కేటగిరీల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

వాయు నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు 13 CAAQMS కేంద్రాల ఏర్పాటు, ఎయిర్ క్వాలిటీ డ్యాష్‌బోర్డు, SMS అలర్ట్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నారు. బొల్లారం, జీడిమెట్లలో ఇప్పటికే 8 లో కాస్ట్ సెన్సార్లను ఏర్పాటు చేయగా, నిర్మాణ, కూల్చివేత, రీసైక్లింగ్ ప్రాంతాల్లో వాటి వినియోగాన్ని విస్తరిస్తున్నారు. రోడ్ల మెరుగుదల, మెకానికల్ రోడ్ స్వీపింగ్, గ్రీన్ కవర్, మియావాకీ ప్లాంటేషన్లు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, PUC వ్యవస్థ బలోపేతం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. GHMC పరిధిలో TGSRTC ప్రస్తుతం 310 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. నల్గొండ, సంగారెడ్డి ప్రాంతాల్లో కాలుష్య మూలాల శాస్త్రీయ గుర్తింపునకు Source Apportionment Study, రాష్ట్రస్థాయి Emission Inventoryపై కూడా చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా, స్వచ్ఛ వాయు సర్వేక్షణలో నల్గొండ 16వ వార్డు జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ సాధించి రూ.20 లక్షల పురస్కారం పొందడంపై కమిటీ హర్షం వ్యక్తం చేసింది. రవాణా, మున్సిపల్, ట్రాఫిక్, పరిశ్రమలు, వ్యవసాయం తదితర శాఖల సమన్వయంతో పాటు ప్రజల భాగస్వామ్యంతోనే మెరుగైన వాయు నాణ్యత సాధ్యమని అధికారులు స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
SIR తర్వాత ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్..

SIR తర్వాత ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్..

ఐఐటీ మద్రాస్‌లో కొత్త స్కిల్ కోర్సులు..

ఐఐటీ మద్రాస్‌లో కొత్త స్కిల్ కోర్సులు..

ఏపీ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ...

ఏపీ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ...

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి..

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి..

దసరా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..

దసరా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..

‘ఇందిరా మహిళా శక్తి భవనాల’పై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్...

‘ఇందిరా మహిళా శక్తి భవనాల’పై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్...

ట్యాగ్లు
తెలంగాణ వాయు కాలుష్యంవాయు నాణ్యతAQMCTGPCBఅహ్మద్ నదీమ్స్వచ్ఛ వాయు కార్యక్రమంPM10ఎలక్ట్రిక్ బస్సులుస్వచ్ఛ వాయు సర్వేక్షణహైదరాబాద్ కాలుష్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ
రాజకీయాలు

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

ప్రపంచ సంస్థలకు హైదరాబాద్‌ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్‌బాబు
జనరల్

ప్రపంచ సంస్థలకు హైదరాబాద్‌ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్‌బాబు

మీడియా ప్రశ్నలకు ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి- ప్రకాశ్‌రాజ్
రాజకీయాలు

మీడియా ప్రశ్నలకు ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి- ప్రకాశ్‌రాజ్

SIR తర్వాత ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్..
జనరల్

SIR తర్వాత ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్..

ఐఐటీ మద్రాస్‌లో కొత్త స్కిల్ కోర్సులు..
జనరల్

ఐఐటీ మద్రాస్‌లో కొత్త స్కిల్ కోర్సులు..

ఢిల్లీ పర్యటనలో  ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో చంద్రబాబు నాయుడు వరుస భేటీలు...
రాజకీయాలు

ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో చంద్రబాబు నాయుడు వరుస భేటీలు...

ఎనిమిదేళ్ల ప్రేమకథపై తొలిసారి ఓపెన్ అయిన స్టార్ కపుల్...
సినిమాలు

ఎనిమిదేళ్ల ప్రేమకథపై తొలిసారి ఓపెన్ అయిన స్టార్ కపుల్...

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు కొత్త వ్యూహం..
జనరల్

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు కొత్త వ్యూహం..

ఏపీ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ...
జనరల్

ఏపీ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ...

బారాఖంబ పీఎస్‌కు రాహుల్ గాంధీ..
రాజకీయాలు

బారాఖంబ పీఎస్‌కు రాహుల్ గాంధీ..

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి..
జనరల్

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి..

‘సైమన్ గో బ్యాక్’ తరహాలో ‘SIR గో బ్యాక్’ ఉద్యమం- రేవంత్ రెడ్డి
రాజకీయాలు

‘సైమన్ గో బ్యాక్’ తరహాలో ‘SIR గో బ్యాక్’ ఉద్యమం- రేవంత్ రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!