

సైబర్ మోసాలకు పాల్పడుతున్న నిందితులపై తెలంగాణ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 101 మందిని అరెస్ట్ చేశారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో 18 మంది మహిళలు, 83 మంది పురుషులు ఉన్నట్లు వెల్లడించారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా 1,172 సైబర్ క్రైమ్ కేసులతో సంబంధం ఉన్న నిందితులను గుర్తించినట్లు సైబర్ క్రైమ్ బ్యూరో తెలిపింది. సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంక్ అకౌంట్లు అందిస్తున్న ముఠాను కూడా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మోసాల ద్వారా వచ్చిన డబ్బును స్వీకరించేందుకు, బదిలీ చేసేందుకు లేదా దాచేందుకు ఇలాంటి ఖాతాలను ఉపయోగించే అవకాశం ఉంటుంది. సైబర్ నేరాల వెనుక ఉన్న నెట్‌వర్క్‌లను ఛేదించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!