6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌..

Writer: Chandrika 05:55 AM, 6 అక్టోబర్, 2026
తెలంగాణ విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌..

తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) రాష్ట్రంలోని రెండు విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) వ్యవసాయేతర విద్యుత్‌ వినియోగదారుల నుంచి రూ.5,420.23 కోట్ల ట్రూ-అప్‌ ఛార్జీలను వసూలు చేసేందుకు అనుమతించింది. 2022-23లో విద్యుత్‌ కొనుగోలుకు అదనంగా చేసిన వ్యయం, 2023-24లో ఏర్పడిన రెవెన్యూ లోటును కలిపి మొత్తం రూ.7,635.22 కోట్లను వసూలు చేసేందుకు డిస్కంలు అనుమతి కోరాయి. బహిరంగ విచారణ అనంతరం వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టాలని, మిగిలిన రూ.5,420.23 కోట్లను వ్యవసాయేతర వినియోగదారుల నుంచి వసూలు చేయాలని ఈఆర్‌సీ ఆదేశించింది. రైతు డిస్కం ఏర్పాటవుతున్న నేపథ్యంలో పిటిషన్లపై కొంతకాలం ఉత్తర్వులు నిలిపివేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తి నేపథ్యంలో ఆలస్యమైన ఈ వ్యవహారంపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తుది ఆదేశాలు వెలువడ్డాయి.

వచ్చే నెల నుంచి జారీ చేసే విద్యుత్‌ బిల్లుల నుంచే ట్రూ-అప్‌ ఛార్జీల వసూలు ప్రారంభించాలని డిస్కంలను టీజీఈఆర్‌సీ ఆదేశించింది. దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో 29 నెలలు, ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో 26 నెలలపాటు ఈ ఛార్జీలు వసూలు చేయనున్నారు. మొదటి నెల బిల్లులో యూనిట్‌కు 30 పైసలు, ఆ తర్వాత నెల నుంచి యూనిట్‌కు 50 పైసలు చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. ఉచిత విద్యుత్‌ పథకం అమల్లో ఉన్నందున వ్యవసాయ వినియోగదారులపై నేరుగా ఈ ఛార్జీలు విధించరు. ప్రతి నెల బిల్లులో ట్రూ-అప్‌ ఛార్జీని ప్రత్యేకంగా చూపడంతో పాటు, అది ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినదో, నెలవారీ వినియోగం ఎంత, యూనిట్‌ రేటు ఎంత అనే వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. డిస్కంల విద్యుత్‌ కొనుగోలు వ్యయం అంచనాలను మించినప్పుడు లేదా ఆదాయం అంచనాల కంటే తగ్గినప్పుడు ఏర్పడే లోటును భర్తీ చేసేందుకు వసూలు చేసే ఛార్జీలనే ట్రూ-అప్‌ ఛార్జీలుగా పిలుస్తారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రమాదంలో రామప్ప దేవాలయం?

ప్రమాదంలో రామప్ప దేవాలయం?

చంద్రుడిపై అణు రియాక్టర్లకు అగ్రరాజ్యాల పోటీ..

చంద్రుడిపై అణు రియాక్టర్లకు అగ్రరాజ్యాల పోటీ..

కార్బన్‌ డయాక్సైడ్‌తో ఆరోగ్యానికి ముప్పు.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు

కార్బన్‌ డయాక్సైడ్‌తో ఆరోగ్యానికి ముప్పు.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు

భారత ఆసుపత్రుల్లోకి విదేశీ పీఈ పెట్టుబడులు..

భారత ఆసుపత్రుల్లోకి విదేశీ పీఈ పెట్టుబడులు..

ఇందిరా ఏకాదశి 2026: ఈ చోట్ల దీపాలు వెలిగిస్తే పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయట!

ఇందిరా ఏకాదశి 2026: ఈ చోట్ల దీపాలు వెలిగిస్తే పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయట!

జ్యోతిష్యం: బంగారం, వెండి, రాగి, ఇనుము.. మీ రాశికి ఏ లోహం శుభప్రదమో తెలుసా?

జ్యోతిష్యం: బంగారం, వెండి, రాగి, ఇనుము.. మీ రాశికి ఏ లోహం శుభప్రదమో తెలుసా?

ట్యాగ్లు
తెలంగాణ విద్యుత్టీజీఈఆర్‌సీట్రూ-అప్‌ ఛార్జీలువిద్యుత్‌ బిల్లులుతెలంగాణ డిస్కంలువిద్యుత్‌ ఛార్జీలువిద్యుత్‌ వినియోగదారులువిద్యుత్‌ టారిఫ్తెలంగాణ ప్రభుత్వందక్షిణ డిస్కంఉత్తర డిస్కం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌లో హోండా కొత్త వ్యూహం..
బిజినెస్

భారత్‌లో హోండా కొత్త వ్యూహం..

ప్రమాదంలో రామప్ప దేవాలయం?
జనరల్

ప్రమాదంలో రామప్ప దేవాలయం?

చంద్రుడిపై అణు రియాక్టర్లకు అగ్రరాజ్యాల పోటీ..
జనరల్

చంద్రుడిపై అణు రియాక్టర్లకు అగ్రరాజ్యాల పోటీ..

ఏఐ ఏజెంట్లకు భావోద్వేగాలు వచ్చాయా?
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్లకు భావోద్వేగాలు వచ్చాయా?

కార్బన్‌ డయాక్సైడ్‌తో ఆరోగ్యానికి ముప్పు.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు
జనరల్

కార్బన్‌ డయాక్సైడ్‌తో ఆరోగ్యానికి ముప్పు.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు

భారత ఆసుపత్రుల్లోకి విదేశీ పీఈ పెట్టుబడులు..
జనరల్

భారత ఆసుపత్రుల్లోకి విదేశీ పీఈ పెట్టుబడులు..

భారత్‌ vs వెస్టిండీస్‌ తొలి టీ20: లఖ్‌నవూలో కరీబియన్‌ సవాల్‌.. శ్రేయస్‌ సేనకు అసలు పరీక్ష
క్రీడలు

భారత్‌ vs వెస్టిండీస్‌ తొలి టీ20: లఖ్‌నవూలో కరీబియన్‌ సవాల్‌.. శ్రేయస్‌ సేనకు అసలు పరీక్ష

తెలంగాణ విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌..
జనరల్

తెలంగాణ విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌..

ఇందిరా ఏకాదశి 2026: ఈ చోట్ల దీపాలు వెలిగిస్తే పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయట!
జనరల్

ఇందిరా ఏకాదశి 2026: ఈ చోట్ల దీపాలు వెలిగిస్తే పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయట!

జ్యోతిష్యం: బంగారం, వెండి, రాగి, ఇనుము.. మీ రాశికి ఏ లోహం శుభప్రదమో తెలుసా?
జనరల్

జ్యోతిష్యం: బంగారం, వెండి, రాగి, ఇనుము.. మీ రాశికి ఏ లోహం శుభప్రదమో తెలుసా?

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందంటే?

బిగ్ బాస్ తెలుగు 10 డే 29: ఐదో వారం నామినేషన్స్‌లో హీటెక్కిన గొడవలు.. త్రిగుణ్, అపూర్వ టార్గెట్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 29: ఐదో వారం నామినేషన్స్‌లో హీటెక్కిన గొడవలు.. త్రిగుణ్, అపూర్వ టార్గెట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!