
జనరల్

జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. అక్కడి సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు గాయపడినట్లు సమాచారం. దాడితో అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే ఎదురుకాల్పులు ప్రారంభించాయి.

ఉగ్రవాదుల కాల్పులను భద్రతా బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. ఘటన జరిగిన ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసి ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, గాయపడిన జవాన్ల ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!