
జనరల్

దక్షిణ కాశ్మీర్‌లోని కోకెర్నాగ్–అనంత్‌నాగ్ రోడ్డుపై ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో జమ్మూ కాశ్మీర్ పోలీస్‌కు చెందిన ఓ సిబ్బంది తీవ్రంగా గాయపడగా, వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే భద్రతా దళాలు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపాయి.
కాల్పుల అనంతరం ఉగ్రవాదులు ఘటనాస్థలం నుంచి పరారైనట్లు అధికారులు తెలిపారు. వెంటనే అదనపు భద్రతా బలగాలను అక్కడికి తరలించి విస్తృత గాలింపు చర్యలు ప్రారంభించారు. దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు భారీ స్థాయిలో ఆపరేషన్ కొనసాగుతుండగా, ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!