
జనరల్

జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్‌లో భద్రతా బలగాలపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ముందుగానే రెక్కీ నిర్వహించినట్లు వెల్లడైంది. లష్కరే తోయిబా కమాండర్ లతీఫ్ భట్, అతడి అనుచరుడు ఉమర్ నిసార్ దార్ నవంబర్ 10న మీర్ బజార్, అఖ్రాన్, హబ్లిష్ ప్రాంతాల్లో సంచరిస్తూ భద్రతా బలగాల కదలికలను పరిశీలించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
నవంబర్ 11న అఖ్రాన్‌లోని సీఆర్‌పీఎఫ్ చెక్‌పోస్టుపై వీరు జరిపిన దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. అనంతరం నవంబర్ 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉమర్ నిసార్ హతమవగా, లతీఫ్ భట్ గాయాలతో తప్పించుకున్నట్లు సమాచారం. దాడికి ముందు రెక్కీ నిర్వహించిన దృశ్యాలతో పాటు, ఘటన అనంతరం ఉగ్రవాదులు పారిపోతున్న దృశ్యాలు కూడా సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!