

భావోద్వేగాలతో కూడిన ఆకట్టుకునే ట్రైలర్‌ను విడుదల చేయడంతో ‘ఆకాశంలో ఒక తార’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్‌కు వస్తున్న స్పందనతో చిత్రబృందం కూడా సినిమా ప్రేక్షకులపై బలమైన ప్రభావం చూపుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తుండగా, సాత్విక వీరవల్లి కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ లభించినట్లు మేకర్స్ ప్రకటించారు. సినిమా నిడివి సుమారు 160 నిమిషాలుగా ఉన్నట్లు సమాచారం. ట్రైలర్‌లోని భావోద్వేగ సన్నివేశాలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ చిత్రంలో శ్రుతి హాసన్, రుహానీ శర్మ, మురళీ శర్మ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గెటప్ శ్రీను, కోట జయరాం, వాసు ఇంటూరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైట్‌బాక్స్ మీడియా (సందీప్ గున్నం, రమ్య గున్నం), గీతా ఆర్ట్స్ (అల్లు అరవింద్), స్వప్న సినిమా (స్వప్న దత్), వైజయంతీ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాలుగు భారతీయ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!