25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక..

Writer: Chandrika 05:40 AM, 25 నవంబర్, 2026
శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక..

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి నిత్య అలంకార ప్రియుడు. స్వామివారికి విలువైన ఆభరణాలు సమర్పించే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. పల్లవరాణి సామవై నుంచి శ్రీకృష్ణదేవరాయలు, వెంకటగిరి, మైసూర్, మరాఠా రాజవంశాల వరకు ఎందరో రాజులు స్వామివారికి కానుకలు సమర్పించారు. సంపన్నులతో పాటు సామాన్య భక్తులు కూడా తమ మొక్కుల్లో భాగంగా ఆభరణాలను అందించారు. 1933లో తితిదే ఏర్పాటైనప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం శ్రీవారి వద్ద 11 టన్నులకు పైగా బంగారు ఆభరణాలు, 10 టన్నుల వెండి ఆభరణాలు ఉన్నాయి. వీటితోపాటు తితిదే పేరిట బ్యాంకుల్లో దాదాపు 12 టన్నుల బంగారం డిపాజిట్ల రూపంలో ఉన్నట్లు సమాచారం.

తితిదే చరిత్రలోనే భారీ విరాళాల్లో ఒకటిగా నిలవనున్న 121 కిలోల బంగారు ఆభరణాలను ఓ అజ్ఞాత భక్తుడు సమర్పించనున్నారు. మొత్తం 45 రకాల ఆభరణాలను చెన్నైలోని ఓ నగల దుకాణంలో ప్రత్యేకంగా తయారు చేయించారు. వీటిలో భుజకీర్తులు, బంగారు శంఖుచక్రాలు, నాగాభరణం, వడ్డాణం, కటి వరద హస్తాలు, పీతాంబరం, హారాలు, అందెలు, పద్మపీఠం తదితర ఆభరణాలు ఉన్నాయి. ఈ నెల 25న ఆభరణాలను తిరుపతికి తరలించి, నవంబర్ 26న ఉదయం తిరుమలలో సీఎం చంద్రబాబు సమక్షంలో తితిదే అధికారులకు అందజేయనున్నారు. శ్రీవారి నిత్య అలంకరణకు సుమారు 40 రకాల ఆభరణాలను వినియోగిస్తారు. మూలమూర్తికి 150కి పైగా, ఉత్సవమూర్తి మలయప్పస్వామికి శ్రీదేవి, భూదేవితో కలిపి 400కు పైగా రకాల ఆభరణాలు ఉన్నాయి. వజ్రాలు, వైడూర్యాలు, పచ్చలు, ఇతర రత్నాలు పొదిగిన ప్రత్యేక ఆభరణాలను పర్వదినాలు, ఉత్సవాల సమయంలో అలంకరిస్తారు. వజ్రాల కిరీటం, ముత్యాల హారాలు, సహస్రనామ హారం, మకర కంఠి వంటి అపురూప నగలు శ్రీవారి అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అవినీతి నిరోధక శాఖ అధికారిపైనే లంచం ఆరోపణలు..

అవినీతి నిరోధక శాఖ అధికారిపైనే లంచం ఆరోపణలు..

నాలుగు రాశుల వారికి కుబేర యోగం.. ధనలాభాలు, అదృష్టం కలిసొచ్చే సూచనలు!

నాలుగు రాశుల వారికి కుబేర యోగం.. ధనలాభాలు, అదృష్టం కలిసొచ్చే సూచనలు!

సుప్రీంకోర్టు అనుమతితో తిరుప్పరన్‌కుండ్రం కొండపై కార్తీక దీపం..

సుప్రీంకోర్టు అనుమతితో తిరుప్పరన్‌కుండ్రం కొండపై కార్తీక దీపం..

నేటి రాశి ఫలాలు:  12 రాశుల వారి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే!

నేటి రాశి ఫలాలు: 12 రాశుల వారి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే!

ముగిసిన ఏఐసీసీ ఇంచార్జ్ సందీప్ కుమార్ తెలంగాణ పర్యటన
ట్యాగ్లు
తిరుమలశ్రీవేంకటేశ్వరస్వామితితిదేబంగారు ఆభరణాలు121 కిలోల బంగారంచంద్రబాబు నాయుడుతిరుపతిశ్రీవారి అలంకరణభక్తుల కానుకలుతిరుమల ఆలయం
AdvertisementAdvertisement

ముగిసిన ఏఐసీసీ ఇంచార్జ్ సందీప్ కుమార్ తెలంగాణ పర్యటన

ఉత్తరకాశీలో భారీ అగ్నిప్రమాదం...

ఉత్తరకాశీలో భారీ అగ్నిప్రమాదం...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
99వ ఆస్కార్‌ అర్హత జాబితాలో భారతీయ చిత్రాలు ‘గోంధల్‌’, ‘అంగ్‌’
సినిమాలు

99వ ఆస్కార్‌ అర్హత జాబితాలో భారతీయ చిత్రాలు ‘గోంధల్‌’, ‘అంగ్‌’

బిస్లరీ తాగునీటి బ్యాచ్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తనిఖీలు..
బిజినెస్

బిస్లరీ తాగునీటి బ్యాచ్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తనిఖీలు..

హీలియం అవసరం లేని ఎంఆర్‌ఐ యంత్రం..
జనరల్

హీలియం అవసరం లేని ఎంఆర్‌ఐ యంత్రం..

డబ్బుల్లేవని గర్ల్‌ఫ్రెండ్‌ వదిలేసి వెళ్లిపోయింది.. కెరీర్‌ ఆరంభ కష్టాలను గుర్తుచేసుకున్న విశ్వక్‌సేన్‌
సినిమాలు

డబ్బుల్లేవని గర్ల్‌ఫ్రెండ్‌ వదిలేసి వెళ్లిపోయింది.. కెరీర్‌ ఆరంభ కష్టాలను గుర్తుచేసుకున్న విశ్వక్‌సేన్‌

ఆర్‌బీఐ చర్యలతో బలపడుతున్న రూపాయి..
బిజినెస్

ఆర్‌బీఐ చర్యలతో బలపడుతున్న రూపాయి..

‘అశ్విన్స్‌’ దర్శకుడితో శ్రుతిహాసన్‌ కొత్త సినిమా..
సినిమాలు

‘అశ్విన్స్‌’ దర్శకుడితో శ్రుతిహాసన్‌ కొత్త సినిమా..

అవినీతి నిరోధక శాఖ అధికారిపైనే లంచం ఆరోపణలు..
జనరల్

అవినీతి నిరోధక శాఖ అధికారిపైనే లంచం ఆరోపణలు..

శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక..
జనరల్

శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక..

నాలుగు రాశుల వారికి కుబేర యోగం.. ధనలాభాలు, అదృష్టం కలిసొచ్చే సూచనలు!
జనరల్

నాలుగు రాశుల వారికి కుబేర యోగం.. ధనలాభాలు, అదృష్టం కలిసొచ్చే సూచనలు!

సుప్రీంకోర్టు అనుమతితో తిరుప్పరన్‌కుండ్రం కొండపై కార్తీక దీపం..
జనరల్

సుప్రీంకోర్టు అనుమతితో తిరుప్పరన్‌కుండ్రం కొండపై కార్తీక దీపం..

నేటి రాశి ఫలాలు:  12 రాశుల వారి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే!
జనరల్

నేటి రాశి ఫలాలు: 12 రాశుల వారి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే!

ముగిసిన ఏఐసీసీ ఇంచార్జ్ సందీప్ కుమార్ తెలంగాణ పర్యటన
జనరల్

ముగిసిన ఏఐసీసీ ఇంచార్జ్ సందీప్ కుమార్ తెలంగాణ పర్యటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!