25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆర్‌బీఐ చర్యలతో బలపడుతున్న రూపాయి..

Writer: Chandrika 06:06 AM, 25 నవంబర్, 2026
ఆర్‌బీఐ చర్యలతో బలపడుతున్న రూపాయి..

క్యారీ ట్రేడ్‌ పెట్టుబడిదారులను ఆకర్షించి రూపాయి విలువను బలోపేతం చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చేపడుతున్న చర్యలు సానుకూల ఫలితాలనిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, ఏఐ షేర్లలో పెట్టుబడుల జోరు మందగించడంతో విదేశీ నిధులు భారత మార్కెట్ల వైపు మళ్లడం కూడా రూపాయికి మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో డాలర్‌తో పోలిస్తే రూ.96.96 స్థాయికి పడిపోయిన రూపాయి ప్రస్తుతం రూ.93 వద్ద కదలాడుతోంది. తక్కువ వడ్డీ రేట్లు ఉన్న దేశాల కరెన్సీల్లో రుణాలు తీసుకుని, అధిక రాబడులు అందించే కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టడాన్నే క్యారీ ట్రేడ్‌ అంటారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ తరహా పెట్టుబడులపై మళ్లీ ఆసక్తి పెరుగుతోంది. ఏఐ రంగంలోని షేర్ల నుంచి కొంతమంది విదేశీ మదుపరులు నిధులను ఉపసంహరించుకుని, గతంలో ఆ ర్యాలీలో పెద్దగా లాభపడని భారత్‌ వంటి మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారు.

అయితే రూపాయిపై విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తి దీర్ఘకాలం కొనసాగుతుందని ఇప్పుడే అంచనా వేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌-అమెరికా కీలక వడ్డీ రేట్ల మధ్య వ్యత్యాసం 2011లో 8.25 శాతం వరకు ఉండగా, ప్రస్తుతం సుమారు 1.5 శాతానికి తగ్గింది. ఇటీవల రూపాయిలో క్యారీ ట్రేడ్‌ ద్వారా వచ్చిన లాభాల్లో దాదాపు 80 శాతం కరెన్సీ విలువ పెరగడం వల్లే సమకూరినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. విదేశీ రుణాల ద్వారా డాలర్ల రాకను ప్రోత్సహించడం, స్పాట్‌, ఫార్వర్డ్‌ మార్కెట్లలో జోక్యం చేసుకోవడం, రూపాయి విలువ పడిపోతుందని అంచనా వేసి షార్ట్‌ పొజిషన్లు తీసుకునేవారికి ఖర్చులు పెరిగేలా నిబంధనలు విధించడం వంటి చర్యలను ఆర్‌బీఐ చేపడుతోంది. అయితే రూపాయి మార్కెట్‌లో లావాదేవీలపై పరిమితులు, విధానపరమైన అనిశ్చితి విదేశీ మదుపరులకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. పెట్టుబడులు దీర్ఘకాలం కొనసాగాలంటే వడ్డీ రేట్ల ప్రయోజనంతో పాటు మార్కెట్‌ స్వేచ్ఛ, విధాన స్థిరత్వం కూడా అవసరమని బ్లూమ్‌బర్గ్‌ విశ్లేషించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిస్లరీ తాగునీటి బ్యాచ్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తనిఖీలు..

బిస్లరీ తాగునీటి బ్యాచ్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తనిఖీలు..

పండగ సీజన్‌లో రికార్డు స్థాయిలో వాహన విక్రయాలు.. విద్యుత్ వాహనాలకు భారీ డిమాండ్

పండగ సీజన్‌లో రికార్డు స్థాయిలో వాహన విక్రయాలు.. విద్యుత్ వాహనాలకు భారీ డిమాండ్

జెన్సన్ హువాంగ్ రీఎంట్రీతో ఎన్విడియా షేర్లలో భారీ ర్యాలీ

జెన్సన్ హువాంగ్ రీఎంట్రీతో ఎన్విడియా షేర్లలో భారీ ర్యాలీ

సావరిన్‌ గోల్డ్‌ బాండ్లలో పెట్టుబడిదారులకు భారీ లాభాలు

సావరిన్‌ గోల్డ్‌ బాండ్లలో పెట్టుబడిదారులకు భారీ లాభాలు

అదానీ ఎయిర్‌పోర్ట్స్‌లో భారీ పెట్టుబడి.. విస్తరణ ప్రణాళికలకు మరింత ఊతం

అదానీ ఎయిర్‌పోర్ట్స్‌లో భారీ పెట్టుబడి.. విస్తరణ ప్రణాళికలకు మరింత ఊతం

ఐపీఓల జీఎంపీ ప్రచారంపై సెబీ కీలక హెచ్చరిక

ఐపీఓల జీఎంపీ ప్రచారంపై సెబీ కీలక హెచ్చరిక

ట్యాగ్లు
భారత రూపాయిఆర్‌బీఐరిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకరెన్సీ మార్కెట్‌క్యారీ ట్రేడ్‌అమెరికా డాలర్‌విదేశీ పెట్టుబడులువడ్డీ రేట్లుముడి చమురు ధరలుభారత ఆర్థిక వ్యవస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
99వ ఆస్కార్‌ అర్హత జాబితాలో భారతీయ చిత్రాలు ‘గోంధల్‌’, ‘అంగ్‌’
సినిమాలు

99వ ఆస్కార్‌ అర్హత జాబితాలో భారతీయ చిత్రాలు ‘గోంధల్‌’, ‘అంగ్‌’

బిస్లరీ తాగునీటి బ్యాచ్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తనిఖీలు..
బిజినెస్

బిస్లరీ తాగునీటి బ్యాచ్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తనిఖీలు..

హీలియం అవసరం లేని ఎంఆర్‌ఐ యంత్రం..
జనరల్

హీలియం అవసరం లేని ఎంఆర్‌ఐ యంత్రం..

డబ్బుల్లేవని గర్ల్‌ఫ్రెండ్‌ వదిలేసి వెళ్లిపోయింది.. కెరీర్‌ ఆరంభ కష్టాలను గుర్తుచేసుకున్న విశ్వక్‌సేన్‌
సినిమాలు

డబ్బుల్లేవని గర్ల్‌ఫ్రెండ్‌ వదిలేసి వెళ్లిపోయింది.. కెరీర్‌ ఆరంభ కష్టాలను గుర్తుచేసుకున్న విశ్వక్‌సేన్‌

ఆర్‌బీఐ చర్యలతో బలపడుతున్న రూపాయి..
బిజినెస్

ఆర్‌బీఐ చర్యలతో బలపడుతున్న రూపాయి..

‘అశ్విన్స్‌’ దర్శకుడితో శ్రుతిహాసన్‌ కొత్త సినిమా..
సినిమాలు

‘అశ్విన్స్‌’ దర్శకుడితో శ్రుతిహాసన్‌ కొత్త సినిమా..

అవినీతి నిరోధక శాఖ అధికారిపైనే లంచం ఆరోపణలు..
జనరల్

అవినీతి నిరోధక శాఖ అధికారిపైనే లంచం ఆరోపణలు..

శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక..
జనరల్

శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక..

నాలుగు రాశుల వారికి కుబేర యోగం.. ధనలాభాలు, అదృష్టం కలిసొచ్చే సూచనలు!
జనరల్

నాలుగు రాశుల వారికి కుబేర యోగం.. ధనలాభాలు, అదృష్టం కలిసొచ్చే సూచనలు!

సుప్రీంకోర్టు అనుమతితో తిరుప్పరన్‌కుండ్రం కొండపై కార్తీక దీపం..
జనరల్

సుప్రీంకోర్టు అనుమతితో తిరుప్పరన్‌కుండ్రం కొండపై కార్తీక దీపం..

నేటి రాశి ఫలాలు:  12 రాశుల వారి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే!
జనరల్

నేటి రాశి ఫలాలు: 12 రాశుల వారి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే!

ముగిసిన ఏఐసీసీ ఇంచార్జ్ సందీప్ కుమార్ తెలంగాణ పర్యటన
జనరల్

ముగిసిన ఏఐసీసీ ఇంచార్జ్ సందీప్ కుమార్ తెలంగాణ పర్యటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!