
సినిమాలు

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరిచేందుకు శాశ్వత వన్‌వే విధానాన్ని అమలు చేయనున్నారు. వన్‌వే మార్గంలో డివైడర్లను తగ్గించి రహదారిని ఆరు లేన్లుగా మార్చేందుకు ప్రణాళిక రూపొందించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న ప్రాజెక్టు రీ-అలైన్‌మెంట్ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం.
ప్రస్తుత ప్రతిపాదనలో ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌ల స్థానంలో ఒక ఫ్లైఓవర్, ఒక అండర్‌పాస్ నిర్మించనున్నారు. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు సుమారు 4.4 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌ను నిర్మించే ప్రతిపాదన ఉంది. ఈ మార్పులతో కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణాన్ని సులభతరం చేయాలని అధికారులు భావిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!