
క్రీడలు

తమిళనాడులోని హోసూరులో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని మురుగునీటి ట్యాంకును శుభ్రం చేస్తున్న సమయంలో విషవాయువు వెలువడటంతో ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పరిశ్రమ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని సంబంధిత మంత్రి హామీ ఇచ్చారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకునే దిశగా విచారణ కొనసాగనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!