

హైలో ఓపెన్ టైటిల్ గెలిచి మంచి జోరుమీదున్న భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఇప్పుడు జపాన్ ఓపెన్ టోర్నీపై దృష్టి సారించాడు. మంగళవారం ప్రారంభమయ్యే ఈ బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో విజేతగా నిలిచి, ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన యు జెన్‌తో లక్ష్యసేన్ తలపడనున్నాడు. మరో మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ డెన్మార్క్ ఆటగాడు రస్‌ముస్ గెమ్కీతో పోటీపడనున్నాడు. మహిళల సింగిల్స్‌లో భారత షట్లర్ మాళవిక బన్సోద్ జపాన్‌కు చెందిన తొమొక మియాజాకిని ఎదుర్కోనుంది.
డబుల్స్ విభాగాల్లోనూ పలువురు భారత షట్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ చైనాకు చెందిన వాంగ్ చాంగ్-షీ హావోనన్ జంటతో తలపడనుంది. హరిహరన్-అర్జున్ జోడీ మలేసియాకు చెందిన ఆరోన్ చియా-వూ యిన్‌ను ఢీకొననుంది. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ జపాన్ క్రీడాకారిణులు హినాటా సుజుకి-నావో యమాకిటాతో పోటీపడనుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో హరిహరన్-తనీషా క్రాస్టో జోడీ చైనా జంట జియాంగ్ జెంగ్-వీ షిన్‌తో, ధ్రువ్ రావత్-మనీషా జోడీ చైనీస్ తైపీకి చెందిన హాంగ్ వీ-నికోల్ గొంజాలెజ్‌తో తమ తొలి మ్యాచ్‌లు ఆడనున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!