
సినిమాలు

గ్రీన్‌కో గ్రూప్ వ్యవస్థాపకుడు అనిల్ చలమలశెట్టి ఆదివారం రాత్రి ఘనంగా దీపావళి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో సూపర్‌స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ స్టార్‌స్టడెడ్ వేడుకకు హాజరయ్యారు. మహేష్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి వేడుకలకు రాగా, రామ్ చరణ్ కూడా సందడి చేశారు.
నటుడు తేజ సజ్జా కూడా ఈ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన నటీనటులు ఒకే వేడుకలో కనిపించడంతో అభిమానులు ఆ ఫొటోలు, వీడియోలను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. తెలుగు సినీ ప్రముఖుల సందడితో అనిల్ చలమలశెట్టి నిర్వహించిన దీపావళి వేడుకలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!