

విజయవాడ వెస్ట్ బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న ఎలక్ట్రిక్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నలుగురు మృతి చెందగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను నున్నకు చెందిన కొమ్మారెడ్డి రాందేవ్ (39), ఆయన తల్లి కొమ్మారెడ్డి అరుణ, ఓ చిన్నారి, నంబూరుకు చెందిన తిగురు విజయగా గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
నంబూరులో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెస్ట్ బైపాస్‌పై ప్రయాణిస్తున్న సమయంలో కారులో మంటలు చెలరేగడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుల బంధువులు ప్రమాద స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారుల నుంచి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!