
క్రీడలు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సాంకేతిక సమస్య కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్–విజయవాడ, విశాఖపట్నం–తిరుపతి మార్గాల్లో ప్రయాణించే రైళ్లపై ప్రభావం పడింది. మౌలాలి దాటిన తర్వాత శాతవాహన ఎక్స్‌ప్రెస్ గంటకు పైగా నిలిచిపోయింది. సికింద్రాబాద్ వద్ద విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను కూడా నిలిపివేశారు.
రైల్వే అధికారులు తాత్కాలికంగా సాంకేతిక సమస్యను పరిష్కరించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. అంతరాయం సమయంలో శాతవాహన ఎక్స్‌ప్రెస్, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లను డీజిల్ ఇంజిన్లతో నడిపించారు. రైళ్ల ఆలస్యంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!