

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాలకు సంబంధించిన 1 లక్ష డాలర్ల చెల్లింపు నిబంధనను మరో ఏడాది కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2026 సెప్టెంబర్ 21 నుంచి మరో 12 నెలల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వైట్‌హౌస్ ప్రకటించింది. అమెరికా వెలుపల ఉన్న కొంతమంది H-1B ఉద్యోగులు అమెరికాలోకి ప్రవేశించేందుకు సంబంధించిన పిటిషన్లకు 1 లక్ష డాలర్ల చెల్లింపు జత చేయాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి.
అదే సమయంలో H-1B దరఖాస్తుల పరిశీలనను మరింత కఠినతరం చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై కూడా ట్రంప్ సంతకం చేశారు. H-1B ఉద్యోగులను స్పాన్సర్ చేస్తున్న సంస్థలు గతంలో అమెరికా ఉద్యోగులను తొలగించాయా లేదా భవిష్యత్తులో తొలగింపులకు ప్రణాళికలు రూపొందించాయా అనే అంశాన్ని దరఖాస్తుల పరిశీలనలో పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఈ మార్పులు ముఖ్యంగా టెక్నాలజీ రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. H-1B వీసాలను పెద్ద సంఖ్యలో ఉపయోగించే భారతీయ ఐటీ నిపుణులు, అమెరికా కంపెనీలపై కూడా దీని ప్రభావం ఉండొచ్చు. అయితే ఇప్పటికే H-1B కలిగి ఉన్నవారు, రెన్యూవల్స్ వంటి సందర్భాలకు వేర్వేరు నిబంధనలు, మినహాయింపులు ఉండవచ్చు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!