

నిహారిక కొణిదెలకు చెందిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మ్యాక్సిమమ్ సిటీ స్టూడియోస్‌తో కలిసి పాకెట్ రాకెట్స్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. రుద్ర అత్రి రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ అర్బన్ డ్రామాలో కమిటీ కుర్రోళ్లు సినిమాతో గుర్తింపు పొందిన త్రినాధ్ వర్మతో పాటు నూతన నటుడు నిర్మల్ నటిస్తున్నారు. శుభం ఫేమ్ శ్రియ కొంతం కథానాయికగా నటిస్తుండగా, జేడీ చక్రవర్తి, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను 'ఫస్ట్ హ్యాండ్' పేరుతో విడుదల చేశారు. ఈ గ్లింప్స్ కథపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమా లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడే ఓ ప్రతిభావంతుడైన పేద విద్యార్థి చుట్టూ తిరుగుతుంది. కథానాయిక సహాయంతో హీరో, అతని స్నేహితుడు శ్రీలంకలో జూదం ఆడటం ప్రారంభిస్తారు. మెరుగైన భవిష్యత్తు కోసం హీరో వేసిన అడుగు క్రమంగా వ్యసనంగా మారుతుంది. దీంతో అతడు మరింత డబ్బు సంపాదించాలనే ఆశతో జూదాన్ని కొనసాగిస్తాడు. ఈ పరిణామాల ద్వారా మానవ అత్యాశ, దాని పర్యవసానాలను సినిమా చూపించనున్నట్లు గ్లింప్స్ సూచిస్తోంది. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రమేష్ మాన్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. జ్ఞాని సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 11న విడుదల కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!