
సినిమాలు

గత రెండు రోజుల్లో చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో హర్మూజ్ జలసంధి నుంచి అమెరికా భారీగా చమురును వెలికి తీసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. త్వరలోనే ఇరాన్ లొంగిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శ్వేతసౌధంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా తోసిపుచ్చింది. హర్మూజ్ జలసంధికి సంబంధించి ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు గతంలో చేసిన వాదనలకు పునరావృతమేనని పేర్కొంది.
ఇరాన్ భద్రతకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఈ ప్రాంతంలోని ఎలాంటి మౌలిక సదుపాయాలూ సురక్షితంగా ఉండబోవని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ హెచ్చరించారు. దీంతో హర్మూజ్ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ట్రంప్ వ్యాఖ్యలు, ఇరాన్ ప్రతిస్పందనతో ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలపై మరింత దృష్టి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!