
రాజకీయాలు

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉపనేత తన్నీరు హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు సంవత్సరీక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆదివారం కోకాపేటలోని హరీశ్ రావు నివాసానికి చేరుకున్న కేసీఆర్.. దివంగత సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు కుటుంబ సభ్యులను కలిసి తన సంఘీభావాన్ని తెలియజేశారు.
అనంతరం హరీశ్ రావును, ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కుటుంబ సభ్యులతో పాటు పార్టీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని దివంగత సత్యనారాయణ రావుకు నివాళులర్పించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!