

శ్రీవారి భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా బుక్ చేసుకునే కమర్షియల్ ద్విచక్ర వాహనాలను తిరుమల ఘాట్ రోడ్డులోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. అలాంటి వాహనాలను అలిపిరి చెక్‌పోస్ట్ వద్దే నిలిపివేయనున్నారు. అంతేకాకుండా యాప్‌లలో కనిపించే ‘తిరుమల రైడ్’ బుకింగ్ ఆప్షన్‌ను తొలగించాలని సంబంధిత సంస్థలకు టీటీడీ సూచించింది. భక్తులకు అవగాహన కల్పించేందుకు అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద ప్రత్యేక ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసింది.
ఇటీవల తిరుమల మొదటి ఘాట్‌లో జరిగిన బైక్ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో టీటీడీ ఈ చర్యలకు దిగినట్లు తెలిపింది. రాబోయే రోజుల్లో నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. అయితే భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సులు, అనుమతించబడిన సొంత వాహనాల్లో యథావిధిగా తిరుమలకు వెళ్లవచ్చు. ఘాట్ రోడ్డులో ప్రయాణించే భక్తులు వేగ నియంత్రణ పాటిస్తూ, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!