
జనరల్

నవంబర్ 11న సంగారెడ్డి జిల్లాలోని ఓఆర్ఆర్‌పై కొల్లూరు సమీపంలో వరుసగా రెండు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మొదట నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంతో భయాందోళనకు గురైన వారు కారు నుంచి బయటకు దిగారు. అయితే, అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు రోడ్డుపై ఉన్న ఆ నలుగురిని ఢీకొట్టింది. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.
అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి క్షతగాత్రులను గమనించి వెంటనే సహాయం అందించారు. తన సొంత వాహనంలో వారిని హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ ఘటనపై కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!