
జనరల్

బ్రిటన్ ప్రధాని, లేబర్ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ తన రాజీనామాను ప్రకటించారు. పార్టీ అంతర్గతంగా పెరుగుతున్న ఒత్తిడి, వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు నాయకత్వ మార్పు అవసరమనే అభిప్రాయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తన పార్లమెంటరీ పార్టీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నానని పేర్కొన్నారు.
కొత్త లేబర్ పార్టీ నాయకుడి ఎంపిక పూర్తయ్యే వరకు ప్రధానిగా కొనసాగుతానని స్టార్మర్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారగా, ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!