
జనరల్

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేటి నుంచి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన ఈ రోజు రాత్రి విశాఖకు చేరుకోనున్నారు. ఈ నెల 13న నిర్వహించనున్న సీఐఐ సదస్సులో అమిత్‌షా పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉమెన్ అండ్ డెవలప్మెంట్ సమ్మిట్‌ను కూడా ఆయన ప్రారంభించనున్నారు. మహిళల అభివృద్ధి, సాధికారతకు సంబంధించిన అంశాలపై నిర్వహించే ఈ సదస్సులో కేంద్ర హోంమంత్రి పాల్గొంటారు.
మరోవైపు, ఈ నెల 13న సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక అంశాలపై అమిత్‌షా సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, ప్రాధాన్య అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అమిత్‌షా పర్యటన నేపథ్యంలో విశాఖలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!