11, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కుబేరులపై మరింత పన్ను విధించాలి - యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సీఈఓ

Writer: Pooja 04:23 PM, 11 నవంబర్, 2026
కుబేరులపై మరింత పన్ను విధించాలి - యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సీఈఓ

అమెరికాలో పెరుగుతున్న ఆదాయ, సంపద అసమానతల నేపథ్యంలో సంపన్నులపై అధిక పన్నులు విధించాలనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశంపై యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సీఈఓ స్కాట్ కిర్బీ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తనలాంటి సంపన్నుల నుంచి మరింత పన్ను వసూలు చేయాలని, ఇందుకోసం జాతీయ స్థాయిలో సంపద పన్ను విధానాన్ని తీసుకురావాలని సూచించారు. ది న్యూయార్క్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సంపద అసమానతలు సమాజానికి ముప్పుగా మారుతున్నాయని, వాటిని పరిష్కరించేందుకు విధానపరమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. సంపద పన్నును రాష్ట్రాల వారీగా కాకుండా దేశవ్యాప్తంగా ఒకే విధంగా అమలు చేయాలని అన్నారు. లేదంటే పన్నులు తక్కువగా ఉన్న రాష్ట్రాలకు సంపన్నులు వలస వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

వేతనాలపై ఆధారపడి జీవించే ఉద్యోగులపై పన్ను భారాన్ని తగ్గించాలంటే సంపన్నుల నుంచి ఎక్కువ పన్నులు వసూలు చేయాలని కిర్బీ సూచించారు. వారసత్వంగా లభించే ఆస్తులపై కూడా కొన్ని స్థాయిల్లో దాదాపు 100 శాతం వరకు పన్ను విధించాలని, అలాంటి పన్నును తాను కూడా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు సొంత వేతన ప్యాకేజీ నేపథ్యంలో మరింత చర్చకు దారితీశాయి. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 2025 ప్రాక్సీ నివేదిక ప్రకారం, ఆ ఏడాది కిర్బీకి మొత్తం 32.28 మిలియన్ డాలర్ల పారితోషికం అందగా, సంస్థలో మధ్యస్థ స్థాయి ఉద్యోగి వార్షిక మొత్తం పారితోషికం 96,670 డాలర్లుగా నమోదైంది. మరోవైపు, ఫెడరల్ రిజర్వ్ గణాంకాల ప్రకారం 2026 రెండో త్రైమాసికంలో అమెరికా మొత్తం నికర సంపదలో 32.5 శాతం వాటా అత్యంత సంపన్నులైన ఒక శాతం కుటుంబాల వద్ద ఉంది. ఈ గణాంకాలు అమెరికాలో సంపద కేంద్రీకరణపై కొనసాగుతున్న చర్చకు మరింత ప్రాధాన్యతనిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

నాయుడుపేటలో ఇండో–కొరియన్ బ్యాటరీ పరిశ్రమ

నాయుడుపేటలో ఇండో–కొరియన్ బ్యాటరీ పరిశ్రమ

గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

అయోడిన్‌ బిళ్లల పంపిణీ వార్తలను ఖండించిన ఇరాన్‌

అయోడిన్‌ బిళ్లల పంపిణీ వార్తలను ఖండించిన ఇరాన్‌

సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌లో ఎస్‌ఐ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల
ట్యాగ్లు
స్కాట్ కిర్బీయునైటెడ్ ఎయిర్‌లైన్స్సంపద పన్నువారసత్వ పన్నుసంపద అసమానతలుఅమెరికా ఆర్థిక వ్యవస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌లో ఎస్‌ఐ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

సామాన్యులకు షాక్.. లీటర్ పాలపై రూ.4 వరకు పెంచిన మదర్ డెయిరీ

సామాన్యులకు షాక్.. లీటర్ పాలపై రూ.4 వరకు పెంచిన మదర్ డెయిరీ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి
రాజకీయాలు

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య
సినిమాలు

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య

నాయుడుపేటలో ఇండో–కొరియన్ బ్యాటరీ పరిశ్రమ
జనరల్

నాయుడుపేటలో ఇండో–కొరియన్ బ్యాటరీ పరిశ్రమ

కంగనా ఇన్‌స్టా పోస్ట్‌తో రాజకీయ దుమారం
రాజకీయాలు

కంగనా ఇన్‌స్టా పోస్ట్‌తో రాజకీయ దుమారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!