
గాసిప్స్

అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలో కురిసిన అకాల భారీ వర్షం వరి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. గ్రామానికి చెందిన రైతులు పాండ్య నాయక్, బలరాం తమ పొలాల్లో వరి సాగు చేశారు. పంట చేతికి రావడానికి మరో 20 రోజులు మాత్రమే సమయం ఉండగా, శుక్రవారం కురిసిన భారీ వర్షానికి వరి పంట నేలకొరిగింది. దీంతో నెలల తరబడి కష్టపడి సాగు చేసిన పంట దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవడంతో అందుబాటులో ఉన్న బోరు నీటితో పంటను కాపాడుకుంటూ వచ్చామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట కోతకు సిద్ధమవుతున్న సమయంలో అకాల వర్షం నష్టం కలిగించడంతో తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన రైతుల పంటలను అధికారులు పరిశీలించి, తగిన పరిహారం అందించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!