
జనరల్

అగ్రరాజ్యం అమెరికా భారీ రుణభారంలో చిక్కుకుంటోంది. అమెరికా జాతీయ రుణం చరిత్రలో తొలిసారి 40 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. అమెరికా ట్రెజరీ శాఖ గణాంకాల ప్రకారం మొత్తం రుణం 40.047 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో ప్రజల వద్ద ఉన్న రుణం 32.266 ట్రిలియన్ డాలర్లు కాగా, ప్రభుత్వ అంతర్గత రుణం సుమారు 7.782 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
సామాజిక భద్రతా పథకాలపై పెరుగుతున్న వ్యయం, వడ్డీ చెల్లింపులు అధికం కావడం వంటి కారణాలతో అమెరికా రుణభారం మరింత పెరుగుతోంది. జాతీయ రుణం రికార్డు స్థాయికి చేరుకోవడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలికంగా ఎదుర్కొనే సవాళ్లపై చర్చ మొదలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికా ఆర్థిక స్థిరత్వంపై ఈ పరిణామం దృష్టిని ఆకర్షిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!